బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (12:51 IST)

మరదలి పెళ్లిలో మెరిసిన చెర్రీ.. ఉపాసన రాయల్ లుక్

అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శోభనా కామినేని, అనిల్ కామినేని దంపతుల కుమార్తె అనుష్పాల కామినేని వివాహం అట్టహాసంగా జరిగింది. అర్మాన్ ఇబ్రహీం మాజీ ఇండియన్ ఎఫ్3 ఛాంపియన్ అక్బర్ ఇబ్రహీం కుమారుడు, చెన్నైకి చెందిన కార్ రేసర్ అర్మాన్‌‌ల వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఈ పెళ్లికి చెర్రీ దంపతుల దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెళ్లికి, రామ్ చరణ్ క్రీం కలర్ షేర్వాణిని ధరించగా, ఉపాసన భారీగా అలంకరించబడిన షరారా సెట్‌ను ఎంచుకుంది. 
 
తన సోదరి వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంటూ ఉపాసన “నిజంగా నా
జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. చాలా కృతజ్ఞతలు. నా ప్రియమైన సోదరి మీకు శుభాకాంక్షలు. నేను మీ ప్రేమలో మునిగిపోయాను” అంటూ పోస్ట్ చేసింది.