సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (11:28 IST)

ఈ నక్కల వేట ఎంత సేపు.. కుంభస్థలాన్ని బద్ధలకొడదాం.. 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలు. అజయ్ దేవగన్, సముద్రఖనిలు ప్రత్యేక పాత్రలను పోషిస్తున్నారు. అలియా భట్ హీరోయిన్. ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన వారికి రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. "భీమ్... ఈ నక్కల వేట ఎంత సేపు.. కుంభస్థలాన్ని బద్ధలుకొడదాం పదా.." అంటూ చెర్రీ చెబుతున్న డైలాగ్ ఓ రేంజ్‌లో ఉంది. 
 
ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్‌లు నటిస్తున్నారు. ఈ ఇద్దరికి సంబంధించిన విజువల్స్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివరులో చెర్రీ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తోంది. 
 
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా, జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకుల చేత నాట్యం చేయిస్తున్న విషయం తెల్సిందే.