శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (15:30 IST)

ఆర్ఆర్ఆర్ నుంచి స‌ర్‌ప్రైజింగ్ వీడియో-ఎన్టీఆర్ స్టన్నింగ్ స్టిల్స్ (వీడియో)

NTR
జక్కన్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి స‌ర్‌ప్రైజింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో ఎన్టీఆర్ కొన్ని స్ట‌న్నింగ్ విజువ‌ల్స్ మాత్ర‌మే చూపించి ఆస‌క్తిని రేకెత్తించారు. 
 
మంగళవారం వరుసగా రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ పాత్రల బీటీఎస్ వీడియోలను పంచుకున్నారు. రామ్ చరణ్ లుక్, సీతగా అలియా భట్ ప్రిపరేషన్, అజయ్ దేవగన్‌కి సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ టీం నుండి వ‌చ్చిన అప్‌డేట్స్ ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. 
 
డిసెంబర్ 9న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల చేయాల్సి ఉంది. కానీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతోపాటు.. కొన్ని అనుకోని కారణాల వలన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వాయిదా వేశారు.