గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 6 డిశెంబరు 2021 (18:41 IST)

చంద్ర‌న్న వేదిక‌లో ఏపీ సీఎం జ‌గ‌న‌న్న క‌ప్...

ఏపీ సీఎం కప్. 2021 పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారులను అభినందిస్తున్నానని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం కొవ్వూరులోని చంద్ర‌న్న స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, క్రీడల వల్ల విద్యార్థులలోప్రతిభ కనబరడానికి ఒక మంచి వేదికగా సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 
 
 
వారిలో శరీర దృఢత్వం పెరగడంతో పాటు ఆరోగ్యంగాను, ఏకాగ్రత పెరిగి వారిలో మానసిక ధైర్యం పెంపొందించుకో గలుగుతా రన్నారు. క్రీడల్లో పాల్గొనడం ముఖ్య మని గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, ఎటువంటి పరిస్థితి నైనా ఎదుర్కొనే పరిపక్వత విద్యార్థులకు అలవడుతుందని పేర్కొన్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను తెలుసుకుని, వారిని ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారిని డిసెంబరు 2 వ వారంలో ఏలూరులో నిర్వహించే జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలకు పంపడం జరుగుతుందన్నారు.
 
 
కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాలు నుంచి సుమారు 400 మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు కబడ్డీ, ఖో -ఖో, వాలీబాల్, షెటిల్, బాల్ బ్యాటమేంటన్ తదితర క్రీడల్లో  పాల్గొన్నారని అధికారులు తెలిపారు. ఈ ఎంపిక కార్యక్రమంలో మునిసిపల్  ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి, జెడ్.పి. టి. సి., బొంతా వెంకట లక్ష్మి, మాజీ యం.ఎల్.సి. కోడూరి శివరామ కృష్ణ,  మునిసిపల్ వైస్ ఛైర్ పర్సన్లు మన్నే పద్మ, గండ్రోతు అంజలీదేవి, చాగల్లు యంపిపి., మట్టా వీరాస్వామి, కౌన్సిలర్లు ఆర్. భాస్కర రావు, అక్షయ పాత్ర శ్రీనివాస రవీంద్ర, డి.ఎల్.డి.ఓ/ ఎంపిడిఓ పి. జగదాంబ, ఎమ్ఇఓ జె. కెంపు రత్నం, పీడీ స్పోర్ట్స్ నాగరాజు, మూడు మండలాల  విద్యార్థిని, విద్యార్థులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.