Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

రాఖీబాయ్ రొమాన్స్ చేయనున్న పూజా హెగ్డే?

Written By సెల్వి
Updated: శనివారం, 18 జూన్ 2022 (19:42 IST)
కేజీఎఫ్ హీరో యశ్ తాజా సినిమాలో పూజా హెగ్డే నటించనుందని టాక్. నర్తన్ దర్శకత్వంలో యశ్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడని, ఈ సినిమాలోనే పూజా హీరోయిన్‌గా చేయనుందని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ వార్తల్లో నిజం లేదని, యశ్ సినిమా కోసం ఆమెను ఎవ్వరూ సంప్రదించలేదని సన్నిహిత వర్గాల నుంచి క్లారిటీ వస్తోంది. 
 
ప్రస్తుతం పూజా హైదరాబాద్‌లో జరుగుతోన్న కభీ ఈద్ కభీ దివాలి సినిమా షూట్‌లో బిజీగా ఉంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫర్హాద్ సంజీ దర్శకుడు.
 
ఇదిలా వుండగా.. కేజీఎఫ్2 ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేజీఎఫ్3కి మేకర్స్ శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమవుతున్నారు. సినిమాలోనే మరో సీక్వెల్ ఉంటుందని దర్శకుడు హింట్ ఇవ్వడంతో, ఆడియన్స్ నుంచి దానికి డిమాండ్ వచ్చిపడింది.
 
ఈ క్రమంలోనే కేజీఎఫ్3 ఉంటుందని, మేకర్స్ స్పష్టం చేశారు. అయితే, ఎప్పట్నుంచి ఈ సీక్వెల్ ప్రారంభమవుతుందన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. 
 
ఎందుకంటే, దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్‌తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్‌తోనూ సెట్స్ మీదకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. కాబట్టి, కేజీఎఫ్3 సెట్స్ మీదకి వెళ్లేందుకు చాలా సమయమే పట్టేలా కనిపిస్తోంది.

అన్నీ చూడండి

వేధింపులు భరించలేక మామను హత్య చేసిన కోడలు.. కేసులో సరికొత్త ట్విస్ట్

దుబాయ్‌ ఫిబ్రవరి తర్వాత అత్యధిక సందర్శకుల సంఖ్య నమోదు చేసింది; అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026

నన్ను వదిలేయండి.. నేను లండన్‌కు వెళ్లిపోతా.. నా భర్త విచారణకు వస్తారు.. రామ నందన

బ్రిక్స్ భద్రతా వీడియోల వ్యవహారంలో ఢిల్లీ పోలీస్ సస్పెండ్

వినాయక చవితి: గణేష విగ్రహాల నిమజ్జనాలు ప్రారంభం.. భారీగా ఏర్పాట్లు

అన్నీ చూడండి

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk

నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments