బుట్టబొమ్మ బాగా డిమాండ్ చేస్తుందట
బుట్టబొమ్మ.. ఈ పేరు చెబితే చాలు అందరికీ ఠక్కున గుర్తుకువచ్చే పేరు పూజా హేగ్డే. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం అల.. వైకుంఠపురములో. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమాలో పాటలు అయితే.... యూట్యూబ్‌ని షేక్ చేసాయి. అసలు విషయానికి వస్తే... అదేనండి క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే విషయానికి వస్తే.. ఒక లైలా కోసం, ముకుంద సినిమాల్లో నటించింది.
ఆతర్వాత ఆశించిన స్ధాయిలో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కి వెళ్లింది. ఆ తర్వాత స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.
ఈ సినిమా కమర్షియల్‌గా సక్సస్ కావడంతో టాలీవుడ్లో పూజా టైమ్ స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్‌తో అరవింద సమేత, వరుణ్ తేజ్‌తో గద్దలకొండ గణేష్, అల్లు అర్జున్‌తో అల.. వైకుంఠపురములో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ప్రభాస్‌తో రాథేశ్యామ్, అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాల్లో నటిస్తుంది.
ఈ అమ్మడుకి కూడా బాగా డిమాండ్ ఉంది. అందుకనే .. పూజా కూడా సినిమాల్లో నటించాలంటే 2 కోట్లు డిమాండ్ చేస్తుందట. ముందు 2 కోట్లు ఇవ్వడానికి ఓకే అంటేనే కథ వింటానని చెబుతుందట. రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గడం లేదట ఈ అమ్మడు. అది మేటరు.