ప్రియమణి అడుగుతున్న దానికి నిర్మాతలు షాక్
ప్రియమణి. సహజ నటనతో మెప్పించడంలో ఈ బ్యూటీ మేటి. ఆమె నటించిన భామాకలాపం ఓటీటీలో విడుదలై సక్సెస్ కొట్టింది. దీనితో ప్రియమణి మంచి జోష్ మీద వుందట.
తన తదుపరి చిత్రాలకు పారితోషికాన్ని ఒక్కసారిగా రెట్టింపు చేసినట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఇదివరకు రోజుకి రూ. 1.5 లక్షలు తీసుకునే ప్రియమణి ఇప్పుడు ఏకంగా రూ. 3 లక్షలు డిమాండ్ చేస్తోందట. అంటే.. 30 రోజులకి సుమారుగా కోటి రూపాయలన్నమాట.