గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: మంగళవారం, 3 అక్టోబరు 2017 (14:11 IST)

బుద్ధుంటే మళ్లీ ఆ హీరోతో నటించను... రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు సినిమాల్లో నటిస్తూ చివరకు హైదరాబాద్ లోనే మకాం వేసి ఉంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. సినిమాల్లో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ తెలుగులో ఇప్పుడు అగ్రహీరోయిన్లలో ఒకరు. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ భామ స్పైడర్ సినిమా పైన భారీ అంచనాలనే పెట్టుకుంది.

తెలుగు సినిమాల్లో నటిస్తూ చివరకు హైదరాబాద్ లోనే మకాం వేసి ఉంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. సినిమాల్లో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ తెలుగులో ఇప్పుడు అగ్రహీరోయిన్లలో ఒకరు. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ భామ స్పైడర్ సినిమా పైన భారీ అంచనాలనే పెట్టుకుంది. అంతకుముందు రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమాలన్నీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి కానీ స్పైడర్ అంతగా ఫలితాన్నివ్వలేదు.
 
తళుక్కున మెరిసి మళ్ళీ కనిపించకుండా పోయే పాత్ర రకుల్ ప్రీత్ సింగ్‌ది. అందులోను మురుగుదాస్ లాంటి అగ్ర దర్శకుడి దర్శకత్వంలో రావడమే కాకుండా అగ్ర కథానాయకుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందులో నటించారు. దీంతో రకుల్ అంచనాలను బాగానే పెట్టుకుంది. కలెక్షన్ల విషయంలో సినిమా బాగానే సంపాదించినా రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఇబ్బందులు పడేలా చేసింది. 
 
స్పైడర్ పేరు చెబితే మహేష్ బాబు, మురుగదాస్ అని చెప్పుకుంటున్నారు కానీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఒక్కరు కూడా చెప్పుకోవడం లేదట. దీనితో రకుల్ ప్రీత్ సింగ్ షాకై మూలన కూర్చుని ఓ రోజంతా బాధపడిపోయిందట. ఆ తర్వాత తేరుకున్న రకుల్ మళ్లీ మహేష్ బాబుతో చేస్తారా అని అడిగితే... బుద్ధుంటే మళ్లీ మహేష్ బాబుతో నటించనని అంటోందట. ఈ విషయాన్ని స్వయంగా తన స్నేహితులకు చెప్పిందట.