గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (23:17 IST)

పవన్‌ను సీఎంగా చూడాలని చెర్రీ ఏం చేస్తున్నాడో తెలుసా? (video)

మీ బాబాయ్ రాజకీయాల్లో జీరో. సినిమాలు కూడా పెద్దగా ఆడటం లేదు కదా. అప్పుడప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళి వస్తుంటారు. మీ నాన్నకు రాజకీయం గురించి తెలియదు. మీ బాబాయ్ రాజకీయాలను అప్పుడప్పుడు వాడుకుని డబ్బులు సంపాదించుకోవాలని చూస్తుంటాడు. ఇదంతా ఏమైనా బాగుందా..
 
ఈ మాటలు సాక్షాత్తు రామ్ చరణ్ స్నేహితులే ఆయనతో అన్న మాటలివి. దీంతో సాయిచరణ్ ఆవేదనకు గురయ్యాడట. ఎందుకిలా మాట్లాడుతున్నారు. మా కుటుంబ పరువును ఎందుకు తీస్తున్నారంటూ రామ్ చరణ్ ఒక ఆలోచనకు వచ్చేశాడట.
 
జనసేనపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచాలని.. అలాగే పవన్ కళ్యాణ్‌‌ను సిఎంగా చూడాలన్న ఆలోచనలో ఉన్నారట రామ్ చరణ్‌. అందుకు అవసరమైతే ఎంత డబ్బులు పెట్టడానికి సిద్థమయ్యాడట రామ్ చరణ్. ఇప్పటికే మూడు ఛానళ్ళలో షేర్స్ పెట్టడమే కాకుండా జనసేన పార్టీ గురించే ఎక్కువగా చూపించాలని వారికి చెప్పాడట. అంతేకాకుండా సోషల్ మీడియా రంగంలో అడుగుపెట్టాలని.. ఆ విధంగా కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ పెంచాలన్న ఆలోచనలో ఉన్నారట.
 
అంతేకాకుండా జనసేనపార్టీని బలంగా తీసుకెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ పర్యటనలో బాగా ఖర్చు చేసి జనాన్ని ఆకర్షించేలా చూడాలని కూడా కొంతమంది నిర్వాహకులకు సూచించారట. ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు గడువు ఉన్న నేపథ్యంలో ఎలాగైనా జనసేనపార్టీని గెలిపించాలన్న ఆలోచనలో ఉన్నారట రామ్ చరణ్. మరి చూడాలి ఏమవుతుందో.