Daily Horoscope
✕

రష్మిక మందన అంత తీసుకుంటోందా? (video)

Written By వాసు
Updated: శుక్రవారం, 5 జులై 2019 (19:59 IST)
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతని అక్షరాలా పాటించే వాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది సినీ పరిశ్రమలోని వాళ్లు మాత్రమే. కాస్త క్రేజ్ ఉన్నప్పుడే మూటలు కొద్దీ డబ్బు వెనకేసుకొని లైఫ్‌లో సెటిల్ అయిపోవాలనే ఆలోచనతో నిర్మాతలను ఎడాపెడా వాయించేస్తూంటారు. తాజాగా రష్మిక కూడా ఇదే పనిలో ఉందంటున్నారు సినీ జనాలు. 
 
గీత గోవిందం సినిమాతో మంచి పేరు తెచ్చేసుకున్న రష్మిక.. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటించేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరూలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈవిడకి.. తాజాగా తమిళంలో విజయ్ 64వ చిత్రంగా తెరకెక్కనున్న సినిమాలో ఛాన్స్ దక్కిందట. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా కూడా మరో హీరోయిన్‍గా నటిస్తోందట.
 
కాగా ఈ సినిమా కోసం రష్మిక భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దాదాపు కోటి రూపాయిలు డిమాండ్ చేసిందనీ… అయితే ఆవిడ అడిగినంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు కూడా సిద్ధం అయ్యారనీ సమాచారం.

అన్నీ చూడండి

వైఎస్ షర్మిలను ఒంటరి చేసిన వైఎస్ బంధువులు.. జగన్ వైపే వెళ్తున్నారు.. చెన్నైలో ఆ పెళ్లికి?

ప్రేమించలేదని ఎలక్ట్రిక్ రంపంతో విద్యార్థినిపై దాడి చేసిన ఉన్మాది

మరో బిడ్డ కావాలంటే.. వాసెక్టమీ చేయిస్తున్నట్టు ప్రచారం చేస్తా : వాన్స్‌కు భార్య వార్నింగ్

నాది కాని దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు : వైఎస్ షర్మిల

Dhanush: రాజకీయాల్లోకి రాబోతున్న ధనుష్.. ఎప్పుడు?

అన్నీ చూడండి

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?

విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం

కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్‌కు చికిత్స

గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు

హెచ్‌సీజీ విశాఖ, ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన

తర్వాతి కథనం
Show comments