మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (20:32 IST)

వ్యాపారవేత్తను పెళ్ళాడిన సంజన గల్రాని..!

గ‌త ఏడాది నుండి టాలీవుడ్‌లో పెళ్లిళ్ల హ‌డావిడి న‌డుస్తూనే ఉంది. ఇన్నాళ్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌గా ఉన్న సెల‌బ్స్ ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ఓ వైపు క‌రోనా మ‌హ‌మ్మారి భ‌య‌పెడుతున్న‌ప్ప‌టికీ కొద్ది మంది బంధువులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో స్టార్స్స్ పెళ్లిళ్లు చేసుకున్నారు. వీరి పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాను ఎంత‌గా షేక్ చేశాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 
 
తాజాగా సంజన గల్రానీకి వివాహం జరిగింది. ప్రభాస్‌తో 'బుజ్జిగాడు' సహా కొన్ని తెలుగు సినిమాలు, బాలీవుడ్‌ సినిమాలతో పాటు కన్నడ సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ సంజన గల్రానీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. పెళ్లి చేసుకుని సెటిలైంది. ఈ విషయాన్ని ఆమె ధృవీకరించింది. సంజనా గల్రాని కర్ణాటకలో పేరు డాక్టర్‌ పాషాను పెళ్లి చేసుకుంది. పాషాకు పలు వ్యాపారలు కూడా ఉన్నాయి. 
 
సంజనా గల్రాని పెళ్లికి పరిమిత సంఖ్యలో స్నేహితులు, బంధులు హాజరయ్యారు. పెళ్లితో పాటు సంజనా డిజిటల్‌ రంగంలోకి కూడా అడుగు పెడుతుంది. అలాగే ఆత్మనిర్బర్‌ పేరుతో నటీనటుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంది సంజనా. 
Sanjjanaa Galrani
 
త్వరలోనే తన డిజిటల్‌ మీడియాకు సంబంధించిన పేరు, ఇతర వివరాలను వెల్లడిస్తానని తెలియజేసింది సంజనా గల్రాని. కాగా ఇటీవల డ్రగ్‌ మాఫియాతో సంబంధాలున్నాయంటూ సంజనా గల్రాని అరెస్ట్‌ కూడా అయిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై విడుదలైంది.