శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జూన్ 2024 (17:52 IST)

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.. రెండేళ్ల సహజీవనం తర్వాత?

Srireddy And Byreddy Siddharth Reddy
Srireddy And Byreddy Siddharth Reddy
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, కర్నూల్ రాజకీయ నేత. కర్నూల్ జిల్లా నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌‌గా ఉన్న ఈ యువనేత గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఆర్థర్ విజయంలో కీలకపాత్ర పోషించారు. రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కొడుకే ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఈ యువ నాయకుడిపై మనసు పారేసుకుంది
 
వివాదాస్పద నటి శ్రీరెడ్డి. ‘బైరెడ్డి.. నువ్ మాగాడివిరా బుజ్జీ’ అంటూ అతనికి కనీసం ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటే చాలు అంటూ హాట్ కామెంట్స్ చేస్తుంది శ్రీరెడ్డి. ఈ పోస్టులు చూసిన బైరెడ్డి శ్రీరెడ్డిని వివాహం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
దీంతో బైరెడ్డి సిద్దార్థ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలు కానుంది. గత రెండేళ్లుగా సహజీవనంలో ఉన్న శ్రీరెడ్డి అండ్ సిద్దార్థ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. సిద్దార్థ్ రెడ్డి ఇంట్లో శ్రీరెడ్డితో పెళ్లికి మొదట ఒప్పుకోక పోయిన తరువాత ఓకే చెప్పారు. ప్రస్తుతం వీరి ఇద్దరు చెన్నైలో ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.