ఆ "నిధి"ని మరికొంతకాలం దాచిపెట్టాలనివుంది.. అందుకే దానికి దూరం.. (Video)
తెలుగు వెండితెరకు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో ఆమె తొలిసారి వెండితెరకు పరిచయమైంది. ఈ ఒక్క చిత్రంతోనే ఆమె మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను దక్కించుకుంది.
అయితే, కరోనా లాక్డౌన్ కారణంగా లభించిన ఖాళీ సమయంలో సింగిల్‌గా ఉన్న హీరోయిన్లలో పలువురు కొంతమంది రిలేషన్‌షిప్ మెయింటెయిన్ చేయడమో, పెండ్లి చేసుకోవడమో చేశారు. కానీ నిధి అగర్వాల్ మాత్రం స్టిల్ బ్యాచిలర్‌గా కొనసాగుతోంది.
దీనిపై ఆమె స్పందిస్తూ, లాక్డౌన్ సమయంలో తాను రొమాంటిక్ రిలేషన్‌షిప్ కోసం ఆశపడలేదన్నారు. అంతేకాదు లాక్డౌన్ పీరియడ్ తన సింగిల్ స్టేటస్ ఏం మార్చలేదని చెప్పింది. పైగా, కొంతకాలంగా సింగిల్‌గానే ఉండాలని భావిస్తున్నానని, అందుకే ఏ ఒక్క హీరోతో డేటింగ్ చేయకుండా దూరంగా ఉంటున్నట్టు చెప్పుకొచ్చింది.
కాగా, ఈమె ఓ కుర్ర తెలుగు హీరోతో డేటింగ్‌లో మునిగి తేలుతున్నట్టు వార్తలు రాగా, వాటికి పై విధంగా స్పందించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అశోక్ గల్లా డెబ్యూట్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, తమిళ హీరో శింబుతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా రానున్న సినిమాలో నిధి అగర్వాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.