బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: గురువారం, 4 అక్టోబరు 2018 (12:44 IST)

త్రివిక్ర‌మ్‌కి అక్క‌డ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింద‌ట‌

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తాజా చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ఎన్టీఆర్ - పూజా హేగ్డే జంట‌గా న‌టించిన ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ఈ నెల 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తాజా చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ఎన్టీఆర్ - పూజా హేగ్డే జంట‌గా న‌టించిన ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ఈ నెల 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. త్రివిక్ర‌మ్ కోసం ఓవైపు బ‌న్నీ ఎదురుచూస్తున్నాడు. మ‌రోవైపు వెంకీతో సినిమా చేస్తాన‌ని మాట ఇచ్చారు.
 
అందుచేత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి చిత్రం వెంకీతోనా..? బ‌న్నీతోనా..? అనేది సస్పెన్స్. ఇదిలా ఉంటే.. వెంకీ ప్ర‌స్తుతం ఎఫ్ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో క‌లిసి వెంకీ మామ అనే సినిమా చేస్తున్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ మూవీ ఈ నెలాఖ‌రున సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 
 
అయితే.. ఇప్ప‌టికిప్పుడు త్రివిక్ర‌మ్ సినిమా చేద్దామ‌న్నా వెంకీ ఫ్రీగా లేరు. అందుచేత త్రివిక్ర‌మ్‌ని వేరే హీరోతో సినిమా చేయ్.. ఆ త‌ర్వాత మ‌నం క‌లిసి సినిమా చేద్దాం అని వెంకీ చెప్పాడ‌ట‌. మ‌రి.. త్రివిక్ర‌మ్ బ‌న్నీతో సినిమా చేస్తాడో..? లేక‌.. వేరే హీరోతో సినిమా చేస్తాడో చూడాలి.