సెట్స్‌కి వెళ్లగానే బెడ్ రూమ్‌ సీన్‌లో నటించమన్నారు.. వాణి భోజన్

సోమవారం, 13 నవంబరు 2023 (13:48 IST)
Vani Bhojan
తమిళ నటి, అందాల సుందరి వాణి భోజన్ సోషల్ మీడియాలో సూపర్ పాపులర్. బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన వాణీ భోజన్ ఇప్పుడు వెండితెరపై రాణిస్తోంది. ఉక్కే తానా దిట్ట సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. కానీ ఆ సినిమా నిరాశ పరచడంతో వాణికి ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆమెకు సూపర్ హిట్స్ లేవు కానీ ప్రస్తుతం బిజీ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. సినీ పరిశ్రమలో నటీమణులపై వేధింపుల ఘటనలు తరచూ వింటూనే ఉంటాం. అదేవిధంగా నటీమణులు ఏది చెబితే అది చేయవలసి వస్తుంది. డబ్బుతోనో, అవకాశాల పేరుతోనో లొంగదీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాణీ భోజన్‌కి కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. 
 
దీనిపై వాణి భోజన్ మాట్లాడుతూ... తాను నటించేందుకు అంగీకరించిన సినిమాలో అనవసరంగా ఓ సీన్ క్రియేట్ చేశారు. సన్నివేశానికి కథకు సంబంధం లేదు. పడకగదిలో రొమాంటిక్ సీన్ అది. ఈ సీన్ సినిమాలో ఉందని నాకు ముందే చెప్పలేదు. 
 
సెట్స్‌కి వెళ్లగానే బెడ్‌రూం సీన్‌లో నటించమని అడిగారు. నేను నటించనని చెప్పినా బలవంతం చేశారు. ఇది నాకు కోపం తెప్పించింది. ఆ సీన్‌లో నటించే ప్రసక్తే లేదంటూ వాణి భోజన్ తేల్చి చెప్పేశాను. డబ్బు కోసం నేను దిగజారను.. అంటూ చెప్పారు. 
 
నెటిజన్లు వాణీ భోజన్ పనిని మెచ్చుకుంటున్నారు. ఆమెకు మద్దతు ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్‌లో బిజీగా ఉంది.

అన్నీ చూడండి

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments