గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: మంగళవారం, 6 ఆగస్టు 2019 (21:47 IST)

ఆ డైరెక్టర్‌తో సినిమా అంటే ఎగిరి గంతేస్తున్న విజయ్ దేవరకొండ..?

వరుస పరాజయాల మధ్యలో ఒక విజయాన్ని సాధించుకున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. అది కూడా అలాంటి..ఇలాంటి హిట్ కాదు.. సూపర్ డూపర్ హిట్. హీరో రామ్‌కు మంచి పేరే వచ్చింది. లవర్ బాయ్ రామ్ కాస్త మాస్ హీరోగా మారిపోయాడు. ఆ రేంజ్‌లో సినిమా హిట్టయ్యింది.
 
పూరీ సినిమా ఇస్మార్ట్ శంకర్ చాలామంది యువ నటులకు బాగా నచ్చేసింది. దీంతో పూరీతో చేయాలని కొంతమంది యువ నటులు తెగ ఆరాటపడిపోతున్నారట. అందులో విజయ్ దేవరకొండ ఒకరు. అయితే విజయ్ మనస్సులో అనుకున్నాడో లేదో గానీ పూరీ జగన్నాథ్ అతనితో సినిమా చేయడానికి సిద్ధమైపోయాడట.
 
అంతేకాదు ఇప్పటికే ఒక కథను కూడా సిద్ధం చేశాడట. ఇదే విషయాన్ని స్వయంగా పూరీ జగన్నాథ్ విజయ్ కు ఫోన్ చేసి చెప్పారట. దీంతో విజయ్ ఎగిరి గంతేసినంత పనిచేశారట. అయితే ఏ బ్యానర్ పైన చేయాలన్న ఆలోచనకు మాత్రం ఇప్పటికీ రాలేదట పూరీ. మైత్రీ బ్యానర్స్ మాత్రం పూరీ జగన్నాథ్‌తో బాగా టచ్‌లో ఉన్నారట. 
 
మీరు తీయబోయే సినిమాను మా బ్యానర్ లో తీయాలని మైత్రీ బ్యానర్స్ సంస్ధ కోరుతోందట. అయితే పూరీ జగన్నాథ్ మాత్రం కొన్ని షరతులను వారికి పెట్టారట. నిర్మాణ భాగస్వామిగా ఛార్మినే పెట్టాలని..అలా అయితే మీ బ్యానర్ లో సినిమా చేయడానికి సిద్థమన్నాడట పూరీ. దీంతో ఆ సంస్ధ వారు ఆలోచనలో పడ్డారట. బ్యానర్ విషయం పక్కనబెడితే విజయ్ దేవరకొండకు మాత్రం పూరీతో సినిమా కావడంతో చాలా సంతోషంగా ఉన్నాడట.