నయనతార కాదు.. త్రిష కానే కాదు.. ఇక సమంతనే?
టాలీవుడ్ అందాల రాశి సమంత ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వస్తోంది. 'యూ టర్న్' తర్వాత నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రంగా వచ్చిన 'ఓ బేబీ'తో, దర్శక నిర్మాతలందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయ. దర్శకనిర్మాతలు ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ రోల్స్ చేయమని సమంతను స్క్రిప్టులను సంప్రదిస్తున్నారట.
ఇటీవల లేడీ ఓరియెంటెడ్ రోల్స్ అంటేనే నయననో, త్రిషనో సంప్రదించేవారు.. ఇప్పుడు సీన్ మారింది.. అందరూ సమంత వైపు మళ్లుతున్నారట. ఇకపోతే.. తమిళంలో ఇంతకుముందు నయనతార ప్రధాన పాత్రధారిగా వచ్చిన 'అరమ్' (కర్తవ్యం) జనాదరణ పొందింది. ఆ సినిమాకి సీక్వెల్‌ను రూపొందించడానికి దర్శకుడు గోపీ నైనార్ సన్నాహాలు చేసుకుంటున్నాడు.
కథానాయికగా ముందుగా ఆయన నయనతారను అనుకున్నప్పటికీ, ప్రస్తుతం తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్టును సిద్ధం చేసుకుని సమంతను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఎంత వరకు నిజమో సమంతనే నోరు విప్పాలి.