గురువారం, 18 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (16:28 IST)

శ్రీవారిని దర్శించుకున్న కార్తీకేయ హీరో నిఖిల్-పల్లవి

Nikhil and pallavi
Nikhil and pallavi
టాలీవుడ్ నటుడు, కార్తీకేయ హీరో నిఖిల్ సిద్ధార్థ.. తన భార్య పల్లవి వర్మతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి నిఖిల్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి ఆలయ అర్చకుల నుంచి ప్రసాదాలు, పట్టువస్త్రాలు స్వీకరించారు. 
 
ఆపై ఆలయానికి వెలుపుల నిఖిల్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇకపోతే.. నిఖిల్ సిద్ధార్థ గత ఏడాది మే 14న డాక్టర్ పల్లవి వర్మను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.  తాజాగా ఈ జంట తిరుమల సందర్శనకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.