1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మే 2023 (21:28 IST)

మహిళలతో వివాహేతర సంబంధం.. షమీపై మాజీ భార్య ఫిర్యాదు

shami- jahan
క్రికెటర్ మహ్మద్ షమీపై మళ్లీ అతని మాజీ భార్య ఆరోపణలు చేసింది. తన భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని.. ఇప్పటికీ మహిళలతో వివాహేతర సంబంధాలు కలిగి వున్నాడని ఆరోపించారు. 
 
అతడిపై నమోదైన క్రిమినల్‌ కేసు విచారణలో గత నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతి లేదంటూ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతడి అరెస్టు వారెంట్‌పై ఉన్న స్టేను ఎత్తివేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
2018లో మహ్మద్ షమీ దంపతులు విడాకులు తీసుకున్నారు. విడిపోయిన భార్య హాసిన్‌ కోర్టు రూ. 1.30 లక్షల భరణం ఇవ్వాలని ఆదేశించింది. ఈ భరణం తనకు సంతృప్తికరంగా లేదని చెప్పింది.
 
ఇకపోతే.. ఈ ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న షమీ.. ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ 4 వికెట్లు పడగొట్టాడు. 
 
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడినప్పటికీ.. షమీ అద్భుత ప్రదర్శనకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.