గురువారం, 8 జూన్ 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 9 ఫిబ్రవరి 2023 (15:54 IST)

నాన్న పేరెందుకు దండగ.. అందుకే పీకి పారేశా... సంయుక్త

SamyukthaMenon
పాప్‌కార్న్ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీతో అడుగుపెట్టింది సంయుక్త మీనన్. తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఆమె సార్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో హీరో ధనుష్ సరసన హీరోయిన్‌గా నటించనుంది ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. 
 
తాజాగా సంయుక్త మీనన్ ఓ ఇంటర్వ్యూలో.. స్కూల్‌లో జాయినైప్పుడు ఇంటిపేరు రాయమన్నారు. అప్పటిదాకా మన పేరు పక్కన ఈ తోక ఏంటా అనుకునేదానిని అంటూ తెలిపింది. సినిమాల్లోకి వచ్చాక నటిగా తనకు బాధ్యత తెలియవచ్చింది. మీనన్ అనే పదం తన పేరు పక్కన వుండటం సబబు కాదనిపించింది.
 
సమానత్వం, మానవత్వం, ప్రేమ అన్నింటినీ తాను కోరుకున్నప్పుడు ఇంటి పేరు అడ్డు వస్తుందనిపిస్తుంది. పైగా తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. 
 
అమ్మ.. నాన్న ఇంటిపేరును కొనసాగించకూడదని కోరుకుంది. తన అభిప్రాయాన్ని తాను గౌరవించాలనుకున్నానని తెలిపింది. ఇకపోతే సంయక్త మీనన్ సాయిధరమ్ తేజ్ విరూపాక్షలోనూ నటించనుంది.