సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (12:43 IST)

మెగాస్టార్ చిరంజీవితో కోరిక అలానే మిగిలిపోయింది : ఆమని

Amani
Amani
మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేయాలన్న కోరిక ఓ కలగానే మిగిలిపోయిందని సినీ నటి ఆమని అన్నారు. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ, తాను చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమానిని. హీరోయిన్‌గా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన సరసన నటిస్తే చాలని అనుకునేదాన్ని. ఓసారి చిరంజీవి "రిక్షావోడు" చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో తనను, సౌందర్యను ఎంచుకున్నారు. ఆ తర్వాత ఈ చిత్రానికి దర్శకుడు మారడంతో తన స్థానంలో నగ్మా వచ్చింది, అలా అందులో నటించే అవకాశాన్ని కోల్పోయాను.
 
నిజానికి "రిక్షావోడు" చిత్రంలో హీరోయిన్లుగా తనను, సౌందర్యను ఎంపిక చేశారు. ఆ సమయంలో నా స్నేహితురాలిగా సౌందర్య ఎంతో సంబరపడిపోయారు. కానీ, ఆ ఛాన్స్ చేజారినపుడు చాలా బాధపడ్డాను అని అన్నారు. అందుకే మెగాస్టార్‌తో సినిమా చేయాలనే కోరిక అలాగే ఉండిపోయింది. ఇక హీరో వెంకటేశ్‌తో సరసన కూడా హీరోయిన్‌గా నటించలేకపోయాను అని తన మనసులోని బాధను వెల్లడించారు. 
 
కాగా, నటకు ప్రధానమైన కథలను, మధ్యతరగతి గృహిణి పాత్రలను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించడంలో ఆమనికి మించిన నటి మరొకరు లేరని చెప్పొచ్చు. ఫలితంగానే ఆమె ఉత్తమ నటి అవార్డును కూడా అందుకున్నారు. "శుభలగ్నం" వంటి చిత్రాల్లో ఆమె అసమానమైన నటనకు అద్దంపడతాయి.