మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 5 మే 2018 (14:55 IST)

అవును.. తెలుగు దర్శకనిర్మాతలు నన్ను పట్టించుకోవట్లేదు: అంజలి

తెలుగు హీరోయిన్లను తీసుకోవడంపై దర్శకనిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపట్లేదని.. క్యాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తిన శ్రీరెడ్డి సంగతి తెలిసిందే. తెలుగు హీరోయిన్లకు అవకాశాలు అంతంత మాత్రంగానే వున్నాయన్న వాదనతో సీతమ్

తెలుగు హీరోయిన్లను తీసుకోవడంపై దర్శకనిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపట్లేదని.. క్యాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తిన శ్రీరెడ్డి సంగతి తెలిసిందే. తెలుగు హీరోయిన్లకు అవకాశాలు అంతంత మాత్రంగానే వున్నాయన్న వాదనతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి కూడా ఏకీభవించింది. తెలుగు హీరోయిన్లలో తెలుగుదనం ఉట్టిపడే హీరోయిన్లలో ఒకరైన అంజలి.. తెలుగు దర్శకనిర్మాతలు తనను పట్టించుకోలేదని చెప్పింది. 
 
అంతేగాకుండా.. తెలుగు నుంచి తనకు అవకాశాలు రావట్లేదని.. తమిళంలో అవకాశాలు బాగానే వస్తుండటంతో అక్కడే వుండిపోతున్నానని అంజలి చెప్పుకొచ్చింది. అంతేగాకుండా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టానని.. తాను బరువు తగ్గడం వల్ల తమిళంలో అవకాశాలు పెరిగాయని అంజలి తెలిపింది. అంతేగాకుండా తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా వున్నానని.. అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని.. మంచి రోల్స్ వస్తే తప్పక చేస్తానని అంజలి వెల్లడించింది.