శనివారం, 9 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (11:03 IST)

పూజా హెగ్డే కాలికి గాయం.. నడవలేకపోతున్న బుట్టబొమ్మ (video)

Pooja Hegde
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే కాలికి గాయం అయ్యింది. ప్రస్తుతం ఆ గాయం నుంచి పూజా హెగ్డే కోలుకుంటోంది. అయితే కాలి గాయం కారణంగా ఆమె పడే తంటాలకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. 
 
తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఒక వీడియోను పంచుకుంది. ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో వైద్యురాలి పర్యవేక్షణలో ఆమె మద్దతుతో నడిచేందుకు ప్రయత్నిస్తోంది. 
 
కాగా "కిసీ కా భాయ్ కిసీ కి జాన్" సినిమా షూటింగ్‌లో నటి పూజా హెగ్డేకు గాయమైంది. ఇకపోతే పూజా హెగ్డే మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.