శనివారం, 2 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (18:27 IST)

విడాకులు ఇచ్చేశా.. నగలు తాకట్టు పెట్టాను.. వాటికి భయపడితే?: ప్రగతి

Pragathi
సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను వెల్లడించారు. వైవాహిక జీవితం సాఫీగా సాగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించానని.. కుదరకపోవడం వల్ల విడాకులు ఇచ్చానని తెలిపారు. 
 
పిల్లలను కష్టపడి చదివించి.. తమ లైఫ్‌కి సంబంధించిన నిర్ణయాలను తీసుకునే స్థాయికి వాళ్లు వచ్చేశారని వెల్లడించారు. జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. కరోనా టైమ్‌లో అందరం నగలు తాకట్టు పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. 
 
జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు తనకు కూడా ఒక సపోర్టు ఉంటే బాగుండేది అనే ఆలోచన వస్తూనే ఉంటుంది. కానీ జరిగిన విషయాలను తలచుకుంటూ కూర్చుంటే.. పని జరగదని..అందుకే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తానని ప్రగతి చెప్పారు. ఎందుకంటే పరిస్థితులకు భయపడితే అవి మరింత భయపెడతాయని చెప్పుకొచ్చారు.