గురువారం, 10 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (17:42 IST)

రష్మిక మందన బర్గర్ ఆర్డర్ చేసింది.. అయితే ఏమొచ్చిందో తెలుసా? (video)

Rashmika
నటి రష్మిక మందన్న సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ సరసన పుష్పలో నటించిన ఈ భామ.. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌లో పాల్గొంటోంది. తమిళంలో కార్తీతో సుల్తాన్‌, విజయ్‌తో వారిసు చిత్రాల్లో నటించి అభిమానుల ఆదరణ పొందింది. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగు, హిందీ భాషలపై దృష్టి సారిస్తోంది. 
 
తన సోషల్ మీడియా పేజీలలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రష్మిక ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆన్‌లైన్‌లో బర్గర్‌ను ఆర్డర్ చేయగా, మరో వస్తువు హవర్ గ్లాస్ డెలివరీ చేయబడింది. దీంతో నిరుత్సాహానికి గురైన ఆమె దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి నిరాశను వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ కంపెనీపై అభిమానులు కూడా ఖండిస్తున్నారు.