ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (16:49 IST)

బుల్లితెర నటి శ్రీవాణి గొంతు మూగబోయింది.. ఆమెకు ఏమైంది?

Actress sreevani
Actress sreevani
బుల్లితెర నటి శ్రీవాణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారం రోజుల పాటు ఆమె గొంతు మూగబోయింది. అవును మీరు చదువుతున్నది నిజమే. తాజాగా ఆమె యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోంది.
 
ఇందులో శ్రీవాణి భర్త మాట్లాడుతూ.. గలగలా మాట్లాడే శ్రీవాణి వారం రోజుల నుంచి మాట్లాడలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. కొంచెం గట్టిగా మాట్లాడినా.. ఆమె గొంతు ఎప్పటికీ పోతుందని తెలిపాడు.
 
గత కొన్ని వీడియోల్లో శ్రీవాణి గొంతు సరిగా రాకపోతే జలుబు వల్లేమో అనుకున్నాం. కానీ వారం రోజుల నుంచి ఆమె గొంతు పూర్తిగా పోయిందని చెప్పాడు. 
 
అస్సలు మాటలు రావట్లేదని.. డాక్టర్‌ దగ్గరకు వెళ్తే.. నెల రోజుల వరకు ఆమె అస్సలు మాట్లాడకూడదని వెల్లడించాడు. మందులు ఇచ్చారని.. మళ్లీ నెల తర్వాత ఆమె నార్మల్ అవుతుందని ఆమె భర్త ఆకాంక్షించాడు.