సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 మార్చి 2022 (18:59 IST)

ఏజెంట్ విడుదల తేదీ వచ్చేసింది..

Agent
అక్కినేని యంగ్ హీరో అఖిల్ తాజా సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకుడు. భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో టాలీవుడ్ నుంచి ఒక సాలిడ్ స్పై థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
ఈ సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు ఆసక్తికర అప్డేట్స్ ఇస్తూ వస్తున్న మేకర్స్ ఇప్పుడు ఓ బ్లాస్టింగ్ అప్డేట్ ని ఓ సాలిడ్ పోస్టర్‌తో అందించారు. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది ఆగష్టు 12న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
 
ఈ చిత్రానికి ధృవ ఫేమ్ హిప్ హాప్ తమీళా సంగీతం అందిస్తుండగా రీసెంట్ గానే మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.