1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (13:06 IST)

మెగా మేనల్లుడితో ఐశ్వర్యా రాజేష్.. నివేదా ప్లేసులో తీసుకున్నారా?

మెగా మేనల్లుడిగా టాలీవుడ్‌లోకి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్. వరసగా సినిమాలు ఫట్ అవుతున్న క్రమంలో చిత్రలహరి సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. చిత్రలహరి ఇచ్చిన జోష్‌తో మారుతీ దర్శకత్వంలో ప్రతి రోజు పండగే అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చేశాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం చూస్తున్నాడు. 
 
ప్రస్తుతం సోలో బ్రతుకే సోబెటర్ అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సాయిధరమ్ తేజ్.. దర్శకుడు దేవ కట్టతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఈ సినిమా కూడా దేవకట్ట తెరకెక్కించిన ప్రస్థానం సినిమాలా ఎమోషనల్ పొలిటికల్ డ్రామా అని అంటున్నారు. ఈ సినిమాలో తేజ్ సరసన నివేదా పెథురాజ్ హీరోయిన్‌గా ఎంపిక చేసారని గతంలో వార్తలు వినిపించాయి.
 
ప్రస్తుతం తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ అంటూ ఫిలిం నగర్‌లో మాట్లాడుకుంటున్నారు. తేజ్ సినిమాకోసం ఐశ్వర్య సైన్ కూడా చేసిందని టాక్. ఐశ్వర్య ఇటీవల క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి 'వరల్డ్ ఫేమస్ లవర్'లో కనిపించింది. 
 
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక తేజ్ సినిమాలో కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ఐశ్వర్య రాజేష్ అయితే సరిగ్గా సరిపోతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.