సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: గురువారం, 20 సెప్టెంబరు 2018 (12:50 IST)

అక్కినేని అఖిల్ మిస్ట‌ర్ మ‌జ్ను లుక్ అదిరిందిగా..

అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న మూడ‌వ చిత్రాన్ని తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి తెర‌కెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు చాలా ఆశ‌లు

అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న మూడ‌వ చిత్రాన్ని తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి తెర‌కెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. ఈ నెల 20న  మ‌హా న‌టుడు అక్కినేని జ‌యంతి. ఈ సంద‌ర్భంగా ఒక రోజు ముందుగానే అఖిల్ తాజా చిత్రం ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఫ‌స్ట్ లుక్ రిలీజ్ అని చెప్పి ఏకంగా టీజ‌రే రిలీజ్ చేసేసారు.
 
ఈ చిత్రానికి ప్ర‌చారంలో ఉన్న మిస్ట‌ర్ మ‌జ్ను అనే టైటిల్‌నే ఖ‌రారు చేసారు. దేవ‌దాసు మ‌న‌వ‌డు, మ‌న్మ‌ధుడు వార‌సుడు అంటూ టీజ‌ర్‌లా రిలీజ్ చేసిన ఈ ఫ‌స్ట్ లుక్‌లో అఖిల్ స్టైల్ సూప‌ర్ అనేలా ఉంది. ఇందులో అఖిల్ లుక్ & హెయిర్ స్టైల్ చాలా కొత్త‌గా ఉంది. ఎస్.ఎస్.త‌మ‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. 6 గంట‌ల్లోనే 1 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ భారీ చిత్రాన్ని జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.