సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (22:08 IST)

త‌గ్గేదే లే.. అంటోన్న అల్లు అర్జున్(Video)

Pupsha teaser
అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప‌రాజ్‌` సినిమా టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగింది. అర్జున్ అభిమానులు వేలాదిగా త‌ర‌లివ‌చ్చి జెఆర్‌.సి. క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ నిండిపోయింది. చెన్నై నుంచి కూడా కొంద‌రు అభిమానులు వ‌చ్చారు.
 
8.45 నిముషాల‌కు అల్లు అర్జున్ ఫంక్ష‌న్‌కు రావ‌డం, టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. టీజ‌ర్‌లో అల్లు అర్జున్ యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఎక్కువ‌గా వున్నాయి.
అడ‌విలో లారీ లోడ్‌తో వ‌స్తుండ‌గా ఓ వ్య‌క్తి విజిల్ వేయ‌గా, యాక్ష‌న్ సీన్స్ మొద‌లవుతుంది. రెండు చేతులు వెన‌క్కి క‌ట్టివేసిన వ్య‌క్తి మొహం క‌నిపించ‌కుండా ముసుగు వేసుకుని వ‌స్తున్న వ్య‌క్తి క‌నిపిస్తాడు. ఆ త‌ర్వాత పోలీసులు ఫైరింగ్‌. ఆ వెంట‌నే లారీలో డ్రైవ‌ర్‌గా అల్లు అర్జున్ క‌నిపిస్తాడు. ఆ వెంట‌నే ర‌స్మిక డాన్స్‌తో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఆ త‌ర్వాత యాక్ష‌న్ స‌న్నివేశాలు. ఆవేశంగా ఒక వ్య‌క్తిని కొట్టిన బ‌న్నీ... త‌గ్గేదే లే.. అంటూ గ‌డ్డం కింద‌నుంచి చేయి నిమురుకుంటూ అన్న డైలాగ్ పేలింది.
 
ఈ కార్య్ర‌క‌మానికి వ‌చ్చిన అనంత‌రం ఒక్క‌మాట‌లో చెప్పాలంటే, ఇదే ఆఖ‌రు మాట పుష్ప గురించి అంటూ అల్లు అర్జున్ త‌గ్గేదే లే..అన్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది.