గురువారం, 30 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (23:41 IST)

హీరోయిన్లను తలదన్నే అందం.. సిల్వర్ చీరలో స్నేహారెడ్డి! (video)

Sneha Reddy
Sneha Reddy
హీరోయిన్లను తలదన్నే అందం అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డిది. అవును.. ఆమె ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం వున్నా.. అల్లువారింటి కోడలు హోదాలో చక్కగా సంసారం చేసుకుపోతోంది. ఇంకా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటుంది స్నేహా రెడ్డి.
 
ఈ క్రమంలో తన అందచందాలను సోషల్ మీడియాలో ఫోటోల రూపంలో షేర్ చేస్తుంటుంది. ఆమెకు నెట్టింట మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ వుంది. తాజాగా స్నేహా రెడ్డి ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. వెండి చీర తళుకులతో హీరోయిన్లను మించిన గ్లామర్‌తో స్నేహా రెడ్డి మెరిసిపోయింది.  
 
చీర మొత్తం సిల్వర్ సీక్వెన్స్. ఆ పై ఆకుల డిజైన్. స్లీవ్‌లెస్ సేమ్ సీక్వెన్స్‌లో డిజైన్ చేసిన బ్లౌజ్.. ఇలా ఈ చీర గురించి ఎంత వర్ణించినా తక్కువే అనేంతలా వుంది. 
Sneha Reddy
Sneha Reddy
 
ఈ సరికొత్త శారీలో స్నేహా రెడ్డి అందం, హీరోయిన్లను తలదన్నేలా వుంది. ఈ శారీలో స్నేహారెడ్డిని చూసిన నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.