మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 15 డిశెంబరు 2018 (13:58 IST)

Mr. మ‌జ్ను ఫ‌స్ట్ సాంగ్‌కి అనూహ్య‌మైన స్పంద‌న‌..!

అక్కినేని అఖిల్ - తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి కాంబినేష‌న్లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ Mr.మ‌జ్ను. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అఖిల్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోన్న ఈ సినిమా ఒక పాట మిన‌హా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఏమైన‌దో.. అనే ఫ‌స్ట్ సాంగ్‌ను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. 
 
ఎస్.ఎస్ థమన్ స్వరపరిచిన ఏమైందో అనే ఈ ఫీల్ గుడ్ లిరికల్ సాంగ్‌ను గీత రచయిత శ్రీమణి రచించిగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు.  ఇంప్రెసివ్‌గా ఉన్న సాంగ్  ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. త్వ‌ర‌లోనే మిగిలిన సాంగ్స్‌ను చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 25న Mr.మ‌జ్ను చిత్రాన్ని వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. ఈ మూవీ అయినా అఖిల్ ఆశించిన విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.