అనసూయ... యాంకర్, యాక్టర్ కమ్ హాట్ బ్రాండ్ అంబాసిడర్!
యాంకర్, యాక్టర్ అయిన అనసూయ ప్రస్తుతం హాట్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం నాగార్జున సినిమా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగ్‌కు మరదలుగా కనిపిస్తున్న అనసూయ తేజ శారీస్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగేందుకు సంతకం చేసేసింది. తద్వారా పెళ్లి దుస్తులకు ఫేమస్ అయిన తేజా శారీస్ సంస్థకు అనసూయ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఈ బ్రాండ్ కోసం ఫోజులిచ్చిన అనసూయ.. పెళ్లికి సంబంధించిన డిజైనర్ వేర్లో అదిరిపోయిందని టాక్ వస్తోంది. కాగా ప్రస్తుతం సోగ్గాడే నా చిన్ని నాయనా సినిమాలో నటిస్తున్న అనసూయ.. అడవిశేషు సినిమ క్షణంలోనూ నటించనుంది.