సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Updated : ఆదివారం, 19 మే 2024 (16:28 IST)

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

pawan-chiru-vanga Geetha
మెగా ఫ్యామిలీని మా నియోజకవర్గంలో వ్యక్తిగతంగా విమర్శిస్తే నేను ఒప్పుకోను అన్నారు పిఠాపురం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత. తనకు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో గౌరవం అన్నారు. అన్నయ్య ఒక్కరే కాదు నాగబాబు గారు, పవన్ కల్యాణ్ గారూ.. ఇలా మెగా ఫ్యామిలీ కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవ మర్యాదలుంటాయని చెప్పారు.
 
రాజకీయాలు వేరు వ్యక్తిగతం వేరు అన్నారు. రాజకీయాల్లో విధానపరంగా పార్టీలు తీసుకున్న నిర్ణయాలను బట్టి మాట్లాడాల్సి వుంటుందని అన్నారు. తను పోటీ చేసిన నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీ కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఎవరూ విమర్శిస్తే ఊరుకోనని చెప్పానన్నారు. అలాగే తను ఏంటో కూడా అన్నయ్య చిరంజీవి గారికి బాగా తెలుసుననీ, ఆ ఫ్యామిలీలోని వారు కూడా ఎక్కడా నన్ను వ్యక్తిగతంగా విమర్శించలేదని చెప్పారు.