1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

తమ్ముడు ప్రచారం చేయమని అడగలేదు.. ప్రచారానికి పిఠాపురం వెళ్లడం లేదు : చిరంజీవి

Chiranjeevi
తన తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయాలని తనను కోరలేదని అందువల్ల తాను పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళడం లేదని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసిన రెండో అత్యున్నత పురస్కారమైన "పద్మవిభూషణ్" అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకుని శుక్రవారం హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తాను రాజకీయాలకు అతీతంగా ఉంటానని చెప్పారు. 
 
తాను తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పిఠాపురానికి తాను రావాలని కళ్యాణ్ కోరుకోడన్నారు. కళ్యాణ్ బాబు ఎపుడూ బాగుండాలని, జీవితంలో అనుకున్నవి సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు. మా తమ్ముడు రాజకీయంగా ఎదగాని మా కుటుంబం మనస్పూర్తిగా కోరుకుంటుందని చెప్పారు. స్వర్గీయం ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని ఆయన కోరారు. తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్‌కు భారత రత్న పురస్కారం ఇచ్చినపుడు ఎన్టీఆర్‌కు కూడా ఈ పురస్కారం ఇవ్వడం సబబన్నారు.