శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (10:36 IST)

నా హబ్బీ రాజీవ్ కూడా అలాంటి వ్యక్తే.. యాంకర్ సుమ

బుల్లితెర యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుమ భర్త రాజీవ్ కనకాల మంచి నటుడు. విలన్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్‌తో మెప్పిస్తున్నాడు. తాజాగా లవ్ స్టోరీ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ పాత్రకి మరింత గుర్తింపు వచ్చింది. అయితే.. తాజాగా సుమ కూడా లవ్ స్టోరీ సినిమాను వీక్షించినట్టు కనిపిస్తోంది. 
 
సోషల్ మీడియా వేదికగా తన భర్త రాజీవ్‌పై ప్రశంశలు కురిపించింది. 'తమ నటనతో మనల్ని లీనం చేసుకోగల నటులు కొంత మందే ఉంటారు. నా హబ్బీ రాజీవ్ కూడా అలాంటి వారిలో ఒక్కరూ. అద్బుతమైన రోల్ పోషించినందుకు కంగ్రాట్స్. ఆ పాత్ర చేసినందుకు నువ్వెంత చెడుగా ఫీల్ అయ్యావో నాకు తెలుసు.. కానీ ఆ పాత్రతో ఎంతో మంది మీద ప్రభావాన్ని చూపించావ్ అని అన్నారు.
 
అలాగే లవ్ స్టోరీ చిత్ర యూనిట్ గురించి మాట్లాడుతూ.. సున్నితమైన అంశాలను, మరింత సున్నితంగా చూపించిన శేఖర్ కమ్ములకు థ్యాంక్స్. నాగ చైతన్యకు హార్టీ కంగ్రాట్స్. సాయి పల్లవి డ్యాన్స్ చూసి నా కళ్లు నొప్పి పుట్టేశాయి. కండ్లు కూడా ఆర్పకుండా సాయిపల్లవి డ్యాన్స్ ను చూస్తూ ఉండిపోయా. లవ్ స్టోరీ టీం మొత్తానికి కంగ్రాట్స్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సుమ.