గురువారం, 14 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (14:05 IST)

క్యారక్టర్ అంటే వర్జినిటీ కాదని చెప్పడాన్ని అభినందిస్తున్నారుః ద‌ర్శ‌కుడు అనిల్ పంగులూరి

Anil Panguluri onthe set
చిత్ర‌రంగంలో వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్దినియోగం చేసుకుంటూ ఏదో చెప్పాల‌న్న త‌ప‌న‌తో వ‌ర్థ‌మాన ద‌ర్శ‌కుల్లో నెల‌కొంది. తాను తీసిన `క్షీరసాగర మథనం` కూడా అటు యువ‌త‌ను ఆలోజింపేచేసేదిగా వుంద‌ని ద‌ర్శ‌కుడు అనిల్ పంగులూరి తెలియ‌జేస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన ఆ సినిమాను ప్ర‌ముఖులు వీక్షించారు. క్యారక్టర్ అంటే వర్జినిటీ కాదని చెప్పడాన్ని ప్ర‌శంసిస్తున్నార‌ని ఇదే త‌మ విజ‌యం భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు ప‌డ్డ క‌ష్టానికి ఫ‌లితంగా తెలియ‌జేశారు. త్వ‌ర‌లో తన తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తానని తెలిపారు.
 
చిత్ర నేప‌థ్యాన్ని వివ‌రిస్తూ, సాఫ్ట్ వేర్ రంగంలోని సాధ‌క‌బాధ‌లు, న‌లుగురు స్నేహితుల్లో ఒక‌రు చేసిన పొర‌పాటుకు మిగిలిన‌వారు ఎలా ఇరుక్కున్నారు. దాన్నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డార‌నే పాయింట్ న‌చ్చి నేనూ నా మిత్రులు రెండేళ్లు ఎంతో ఇష్టంగా కష్టపడి రూపొందించాం. ఈ సినిమాలో స‌న్నివేశ‌ప‌రంగా నేనూ న‌టించాను. మానస్ నాగులపల్లి,  బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడుగా న‌టించారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 
 
క‌థాప‌రంగా కొంద‌రు కొత్త‌వారు కావ‌డంతో అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు చెబుతున్నప్పటికీ  మొత్తంగా అందరూ మెచ్చుకుంటున్నారు. లోపాల‌ను సున్నితంగా చెప్పిన‌ ప్ర‌ముఖుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. త‌ల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న పాత్ర‌లో మానస్ అమ‌రార‌నీ, అలాగే అక్షత, గౌతమ్ శెట్టి, చరిష్మా, మహేష్ లతోపాటు ప్రతి ఒక్కరి పాత్ర ఆకట్టుకుంటోందని తెలిపారు. అజయ్ అరసాడ సంగీతానికి, సంతోష్ శానమోని కెమెరా ప‌నిత‌నానికి  మంచి మార్కులు వేస్తున్నారని అనిల్ ఆనందం వ్యక్తం చేశారు.