సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

బిడ్డ తల్లితో డేటింగ్‌పై స్పందించిన హీరో అర్జున్ కపూర్

బాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎల్లవేళలా వార్త‌ల్లో ప్రముఖంగా నిలిచే హీరోల్లో అర్జున్ కపూర్ ఒకరు. ఈయన బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాతో డేటింగ్ చేస్తున్నారు. ఒక కొడుకు ఉన్న‌ త‌న కంటే పెద్ద వ్య‌క్తితో డేటింగ్‌లో ఉన్న విష‌యంపై నెటిజ‌న్ల‌ ప్ర‌శ్న‌ల‌కు అర్జున్ క‌పూర్ స్పందిస్తూ.. నేను గౌర‌వ‌ప్ర‌ద‌మైన బౌండ‌రీలో ఉన్నా. నా పార్ట్‌న‌ర్ అంటే గౌర‌వ‌ముంది.

నా వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడటానికి ప్రయత్నించను. ఎందుకంటే మీరు మీ భాగస్వామిని గౌరవించాలని భావిస్తున్నా. గతంలో నేను ఉన్న‌ పరిస్థితిలో ప‌లు విషయాలు బ‌య‌ట‌కు రావ‌డం చూశాను. 

ఇది ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకంటే దీని వ‌ల్ల‌ పిల్లలు ప్రభావితమవుతారు. ఆమె సౌక‌ర్య‌వంతంగా ఉన్న దాన్నే నేను చేస్తాను. నేను ఈ రోజు దాని గురించి మాట్లాడుతున్నానంటే.. సంబంధానికి ఒక నిర్దిష్ట గౌరవముండ‌టం వ‌ల్లేనంటూ త‌న రిలేష‌న్ షిప్ గురించి చెప్పుకొచ్చాడు.

అలాగే, తన తండ్రి బోనీ కపూర్‌, చెల్లెళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లతో చాలా క్లోజ్ అయ్యాడు. త‌న జీవితంలో ముఖ్య‌మైన వ్య‌క్తుల్లో తండ్రి బోనీక‌పూర్‌ ఒక‌రని.. తాను ఎలా ఉన్నానో అలా అంగీక‌రించే వ్య‌క్తి ఆయ‌న అని ఓ మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు. 

మీరు ఏదైనా విష‌యాన్ని పట్టుకోండి లేదా వదిలేయండి, ఇది మీకు ఎల్లప్పుడూ ఇది అర్థం కాదు. ఈ విష‌యాన్ని నా జీవితంలో తెలుసుకోగలిగాను. మిలియన్ సార్లు ఈ ఫార్ములాను వాడాను. అవతలి వ్యక్తిని తప్పుగా భావించండి. 

ఎందుకంటే ఇది క్షణికమైనది లేదా తాత్కాలికమైనది. కొన్నిసార్లు మీరు స్నేహాలు, కుటుంబ సంబంధాలతో ఉద్రేకపడతారు. నేను నా తండ్రికి కూడా ఇదే చెప్పాను, నా స్నేహితులకు కూడా చెప్పాను. తండ్రితో ఉన్న ప్ర‌త్యక్షంగా, ప‌రోక్షంగా ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు.