బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (08:32 IST)

బాహుబలిలో శివగామి ఎత్తుకున్న చిన్నారి.. పెరిగి పెద్దదయ్యిందిగా..!

baahubali
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించింది. కలెక్షన్ల పరంగా కుమ్మేసింది. తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలు వ్యాపించేలా చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ బాహుబలిగా కనిపిస్తే, రానా భల్లాలదేవుడుగా , రమ్యకృష్ణ శివగామిగా, v దేవసేనగా, సత్యరాజ్ కట్టప్పగా, తమన్నా అవంతిక పాత్రలలో కనిపించి మెప్పించారు.
 
బాహుబలి తొలి పార్ట్‌లో శివగామి తన చేతిలో ఉన్న చిన్నారిని నీటిలో మునగకుండా పైకి లేపి తుది శ్వాస విడుస్తుంది. ఆ చిన్నారి ఏడుపులు విన్న గిరిజనులు మాహిష్మతి రాజ్యానికి చెందిన వారసుడిని రక్షించి ఆలనా పాలనా చూసుకుంటారు. 
 
అయితే ఆ చిన్నారిని చిన్నప్పటి ప్రభాస్‌గా మనకు చూపించగా, ఆ పాత్ర పోషించింది తన్వి అనే అమ్మాయి. మనకు బాహుబలి సినిమాలో చాలా నెలల పిల్లగా చూపించగా, ఇప్పుడు ఆమె చాలా పెద్దదైంది. 
baby



ప్రస్తుతం ఆమె ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. బాహుబలిలో శివగామి ఎత్తుకున్న పాప ప్రస్తుతం బాగా ఎదిగింది. ఇంకా ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.