ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 4 జనవరి 2019 (14:17 IST)

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ డైరెక్ట‌ర్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడా..?

అల్లుడు శీను సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై.. తొలి చిత్రంతోనే ఘ‌న విజ‌యం సాధించిన యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అల్లుడు శీను త‌ర్వాత స్పీడున్నోడు, జ‌య జాన‌కి నాయ‌క‌, సాక్ష్యం, క‌వ‌చం... ఇలా వ‌రుస‌గా వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించాడు. కానీ... ఆశించిన స‌క్స‌ెస్ సాధించ‌లేక‌పోప‌యాడు. ప్ర‌స్తుతం తేజ దర్శకత్వంలో సీత అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే... సాయి శ్రీనివాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొత్త చిత్రాన్ని ఎనౌన్స్ చేసాడు. 
 
ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వ‌హించ‌నున్నారు. ఈచిత్రంలో సాయి గడ్డంతో కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. సత్యనారాయణ కోనేరు మరియు హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాతో పాటు సాయి శ్రీనివాస్ మ‌రో డైరెక్ట‌ర్‌కి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఇంత‌కీ ఎవ‌రా డైరెక్ట‌ర్ అంటే... ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అజ‌య్ భూప‌తి. అవును.. ఇటీవ‌ల అజ‌య్.. సాయి శ్రీనివాస్‌కి క‌థ చెప్ప‌డం... క‌థ విని ఓకే చెప్ప‌డం జ‌రిగింద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి... ఈ సినిమాని త్వ‌ర‌లో ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.