శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

ఫేక్ నాయకులతో తస్మాత్ జాగ్రత్త.. ఏపీ ప్రజలకు పూనమ్ కౌర్ వినతి

poonam kaur
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సినీ నటి పూనమ్ కౌర్ ఓ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సమీపించడంతో నకిలీ నాయకులు మీ ముందుకు వస్తున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. 
 
ఆదివారం ఆమె చేసిన ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల హక్కులపై గొంతు చించుకుంటున్న నకిలీ నాయకులను నమ్మొద్దంటూ ఏపీ ప్రజలను ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో ఈ ఫేక్ లీడర్లు మహిళలకు హక్కులంటూ లేని అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. 
 
అంతగా అభిమానమే ఉంటే ఢిల్లీలో మొన్నటివరకు ఆందోళన చేసిన రైజర్లకు ఎందుకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. తమ సొంత ప్రయోజనాల కోసమే ఏపీలోని నకిలీ లీడర్లు మహిళలపై అభిమానాన్ని, ప్రేమను కురిపిస్తున్నారని విమర్శించారు. 
 
ఇపుడు ఈ పోస్టు చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేనాని ఉద్దేశించి పూనమ్ కౌర్ ఈ పోస్ట్ పెట్టిందంటూ మండిపడుతున్నారు. మరోమారు ఇలాంటి ట్వీట్స్ చేస్తే ఏం జరుగుతుందో మీ ఊహకు కూడా అందదని పవన్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు.