ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:08 IST)

హిందీ బిగ్ బాస్ 11 కంటిస్టెంట్స్ పెళ్లి పీటలెక్కనున్నారోచ్..

Bigg boss contestants
బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ షోలో పాల్గొనే వారిలో ఎవరైనా ఓ జంటగా మారిపోతున్నారు. ఉత్తరాదిన పుట్టిన ఈ బిగ్ బాస్ మాయ ప్రస్తుతం దక్షిణాదిన కూడా పాకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందీ బిగ్‌బాస్‌ 11 కంటెస్టెంట్స్‌ ప్రియాంక్‌ శర్మ, బెనాఫ్‌షా సూనావాలా త్వరలో పెళ్ళి పీటలు ఎక్కనున్నట్టు తెలుస్తుంది. 
 
తాజాగా వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరిస్తూ హార్ట్‌ ఎమోజీని షేర్ చేశారు. తమ ప్రేమని అందరి ప్రేమలా చూడొద్దు. మాది అసాధారణమైన ప్రేమ అని బెనాఫ్ షా పేర్కొంది. 
 
గతంలో బెనాఫ్‌షా, నటుడు వరుణ్ సూద్‌తో డేటింగ్‌లో వున్నట్లు వార్తలొచ్చాయి. బిగ్ బాస్ షోకి వెళ్ళొచ్చాక ప్రియాంక్‌ శర్మతో ప్రేమాయణం నడుపుతుంది. దాదాపు రెండేళ్ళుగా వారి ప్రేమాయణంపై పుకార్లు వస్తుండగా, చివరిగా ప్రియాంక్‌ శర్మ, బెనాఫ్‌షా సూనావాలా ప్రేమను ధ్రువీకరించారు.