శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శనివారం, 5 డిశెంబరు 2020 (19:12 IST)

ఇద్దరు సేఫ్, ముగ్గురు డేంజర్ జోన్.. ఎవరు?

బిగ్ బాస్ నాలుగవ సీజన్లో రేపు ప్రసారమయ్యే షో మీదే అందరూ ఆసక్తిగా ఉన్నారు. అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారు. ఎవరు హౌస్‌లో ఉంటారన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ సంచనలంగా మారిందనే చెప్పాలి. అందులోను రేపటి ఎపిసోడ్ పైన లక్షలమంది ఆతృతలో ఉన్నారు. 
 
ప్రధానంగా మోనాల్ గజ్జర్‌లను షోలో కావాలనే ఉంచుతున్నారన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అసలు బిగ్ బాస్‌కు దత్తపుత్రిక ఆమె అంటూ బాగా సందేశాలు ట్రోల్ అవుతున్నాయి. మోనాల్‌కు మార్కులు రాకపోయినా ఆమె మాత్రం హౌస్‌లో కొనసాగుతుండటం మాత్రం కంటెస్టెంట్లలో కొంతమందికి ఇష్టం లేదు.
 
అయితే 13వ వారంలో అవినాష్, దేత్తడి హారిక, అభిజిత్, అఖిల్ సార్థక్, మోనార్ గజ్జర్‌లు నామినేట్ అయ్యారు. వీరిలో మార్పులుచేర్పులు కొనసాగుతూ వచ్చాయి. అయితే ఈ వారం మాత్రం అభిజిత్, అఖిల్‌లు సేఫ్ జోన్లో ఉన్నారని, మిగిలిన ముగ్గురు మాత్రం డేంజర్లో ఉన్నారట. ముఖ్యంగా మోనాల్‌కు ఓట్లు అస్సలు పడకపోవడంతో ఆమె వెళ్ళిపోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. మరి ఎవరు వెళతారన్నది రేపటి వరకు ఆగాల్సిందే.