Daily Horoscope
✕

శివబాలాజీ, కౌషల్ పరిస్థితి ఏమిటి.. వెనకడుగు వేస్తున్న సెలబ్రిటీలు

Written By ప్రీతి
Updated: సోమవారం, 8 జులై 2019 (11:34 IST)
ఇప్పటికే తమిళంలో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభమైంది, ఇక తెలుగుతో కూడా బిగ్ బాస్ సీజన్ 3 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 3కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా అందులో కనిపిస్తున్న హోస్ట్ నాగార్జునగా కన్ఫామ్ కాగా, ఇంకా ఇంటి సభ్యులుగా ఎవరెవరు ఎంటర్ కాబోతున్నారనే దానిపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.
 
తెలుగులో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ మొదలైనప్పటి నుంచే బుల్లితెర ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను పొందింది. ఇక ఈ సీజన్‌లో ఎన్టీఆర్ హోస్టింగ్ చేయడంతో ఈ షోకి సూపర్ పాపులారిటీ వచ్చేసింది. ఆ తర్వాత ఆ పాపులారిటీని అలాగే పెంచుతూ న్యాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్ 2ను విజయవంతం చేశారు. ఇక సీజన్ 3పై అంచనాలు పెరిగిపోవడంతో ఈ హోస్టింగ్ బాధ్యతలను సీనియర్ హీరో నాగార్జునకు అప్పగించారు. 
 
అధికారికంగా ప్రకటన ఏదీ జరగకపోయినప్పటికీ బిగ్ బాస్ సీజన్ 3 జులై 21న మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే హౌస్‌మేట్స్ విషయంలో కొన్ని పేర్లు బయటకు వస్తున్నప్పటికీ ఆయా సెలబ్రిటీలు వెంటనే ఖండిస్తూ వస్తున్నారు.
 
100 రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండటం కష్టం అనిపించడంతో చాలా మంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొనడానికి ఇష్టపడటం లేదని సన్నిహిత వర్గాల సమాచారం. ఇందువల్లనే బిగ్ బాస్ సీజన్ 3 పార్టిసిపెంట్స్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని సమాచారం.
 
అలాగే మరో కారణం ఏమిటంటే పాపులారిటీ, అవకాశాల కోసం ఇందులో పాల్గొనడానికి ఒప్పుకునే సెలబ్రిటీలు గత రెండు సీజన్లలో విన్నర్లుగా నిలిచిన శివ‌బాలాజీ, కౌశల్ పరిస్థితి చూసి వెనకడుగు వస్తున్నారంట.

అన్నీ చూడండి

సీఎం చంద్రబాబుపై కేసులు.. సీబీఐకి బదిలీ చేయాలనే పిల్.. హైకోర్టు విచారణ వాయిదా

విజయవంతంగా ఒడిశా తీరంలో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం (video)

మురసు తుఫాను.. ఎనిమిది మంది మృతి... రూ.1,918.55 కోట్ల నష్టం

ప్రైవేట్ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమా?

నవంబర్ 6, 2026 నాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాతావరణ సూచన ఎలా వుందంటే..

అన్నీ చూడండి

రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?

ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్

ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్‌సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం

లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు

తర్వాతి కథనం
Show comments