ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 3 జూన్ 2019 (07:00 IST)

12 కేజీలు బరువు తగ్గిన బోనీ కపూర్... జాన్వీ ఏమన్నారంటే..

దివంగత శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఊబకాయంతో బాధపడుతూ వచ్చారు. అయితే, ఆయన ఇపుడు ఏకంగా 12 కేజీలకు పైగా బరువు తగ్గారు. ప్రస్తుతం ఆయన ఎంతో ఫిట్‌గా స్లిమ్‌గా తయారయ్యారు. 
 
ఆయన్ను చూసిన కుమార్తెల్లో ఒకరైన జాన్వీ కపూర్ తెగ మురిసిపోతోంది. మా డాడీ 12 కేజీల బరువు తగ్గి స్లిమ్ అయ్యారంటూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు.
 
ఇపుడు తన తండ్రిని చూస్తే గర్వంగా ఉందని అంటోంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం శరణ్ శర్మ దర్శకత్వంలో పైలట్ గున్‌జాన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి కార్గిల్ గర్ల్ ఇన్ లక్నో అనే పేరు పెట్టారు. 
 
అలాగే, క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న "త‌క్త్" చిత్రంతో బిజీగా ఉంది. ఇక అజిత్ ప్ర‌ధాన పాత్ర‌లో బోనీ క‌పూర్ పింక్ రీమేక్‌గా "నెర్కొండ పార్వాయి" అనే చిత్రం చేస్తున్నారు. ఇందులో విద్యా బాల‌న్ హీరోయిన్‌గా నటిస్తోంది.