సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (10:36 IST)

టామ్‌ క్రూయిజ్‌తో గన్‌లా వున్న చంద్రబోస్‌

Chandra Bose, Tom Cruise
Chandra Bose, Tom Cruise
ఇటీవలే ఆర్‌.ఆర్‌.ఆర్‌.లో నాటునాటు సాంగ్‌ రాసిన చంద్రబోస్‌ ఆస్కార్‌ అవార్డు నామిని సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి అకాడమీ ఫంక్షన్‌కు వెళ్ళారు. నిన్ననే ఇద్దరూ అక్కడ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ వున్న ఫొటోలను విడుదల చేశారు. ఇక ఆ తర్వాత చంద్రబోస్‌ అక్కడ హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూయిజ్‌తో వున్న ఫొటోను పోస్ట్‌ చేశాడు. దీనికి నెటిజన్లు తెగ కామెంట్‌లు చేస్తున్నారు. చంద్రబోస్‌ గన్‌లాంటివాడు అంటూ టామ్‌ వంటి యాక్షన్‌ హీరోతో కలిసి దిగడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. 
 
కాగా, అకాడమీ అవార్డులలో టామ్‌ క్రూయిజ్‌ నటించిన టాప్‌ గన్‌ మావెరిక్‌ కూడా పలు విభాగాల్లో ఎంపికైంది. ఆ సినిమాకు తగినట్లుగా ‘విత్‌ టాప్‌ గన్‌ టామ్‌’ అంటూ చంద్రబోస్‌ ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ఫొటోను కీరవాణి ప్రత్యేకంగా తీసినట్లు కనిపిస్తుంది.