అఖండను అందుకే చూస్తున్నారన్న చిలుకూరి బాలాజి ఆలయ పూజారి
అఖండ. 61 ఏళ్ల వయసులోనూ నందమూరి బాలకృష్ణ నటన అదుర్స్. యాక్షన్ సన్నివేశాలను సైతం రిస్క్ తీసుకుని చేసారు. ఈ చిత్రం 100 కోట్ల రూపాయల కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తోంది. బాలయ్య కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా దూసుకెళుతోంది.
ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రజలు అంతగా ఆదరించడానికి వెనుక వున్న రహస్యాన్ని చిలుకూరి బాలాజీ ఆలయ పూజారి వివరించారు. అధర్మం, అక్రమం పెరిగిపోయాయనీ, ఆ సమస్యలన్నీ అఖండలో చూపించి, వాటిని ఎలా అంతమొందించాలో అఖండలో చూపించారని చెప్పారు. అందువలనే అఖండ చిత్రం అఖండ విజయాన్ని సాధించిందని అన్నారు.