సోమవారం, 11 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 31 జనవరి 2023 (10:56 IST)

తారకరత్న ఆరోగ్యంపై చిరు ఆశాభావం

chiru-taraka ratna
chiru-taraka ratna
నందమూరి తారకరత్న ఆరోగ్యం గురించి మెగాస్టార్‌ చిరంజీవి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించిన పోస్ట్‌ను తన టిట్టర్‌లో పోస్ట్‌ చేశారు. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.  తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి  ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. 
 
ఇప్పటికే రెండు రాష్ట్రాలలోని నందమూరి అభిమానులు తారకరత్న ఆరోగ్యంగా కోలుకోవాలని భావించారు. కర్నాటకకు చెందిన మంత్రులు, శివరాజ్‌కుమార్‌ వంటి నటులుకూడా తారకరత్న వున్న ఆసుపత్రికి వచ్చి వాకబు చేశారు. నందమూరి బాలకృష్ణ అయితే అక్కడే వుండి డాక్టర్లతో మాట్లాడుతున్నారు. చిరంజీవి పోస్ట్‌ వల్ల ఇండస్ట్రీలో పాజిటివ్‌ సైన్‌ ఏర్పడింది.