మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (14:49 IST)

బ్రిటీష్ వారికి భారత సంతతి పౌరుడు ప్రధాని అవుతారని ఎవరు ఊహించారు?

chiranjeevi
బ్రిటీష్ వారికి భారత సంతతికి చెందిన పౌరుడు ప్రధానమంత్రి అవుతారని ఎవరు ఊహించారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునక్ ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆయన మంగళవారం దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 
 
ఆయనతో బ్రిటన్ రాజు చార్లెస్-2 ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రిషి సునక్ ఎంపికై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమతమ సందేశాలు, అభినందనలను ట్విట్టర్ వేదిక ద్వారా షేర్ చేసుకుంటున్నారు. అలాంటి వారిలో చిరంజీవి ఒకరు. ఇదే విషయంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"భారతదేశం బ్రిటీష్ (ఆంగ్లేయులు)వారి నుంచి స్వాతంత్ర్యం పొంది 75 యేళ్లు జరుపుకుంటున్న శుభ తరుణంలో బ్రిటిష్ వారికి భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తి ప్రధానమంత్రి, అదీ కూడా మొట్టమొదటి హిందూ ప్రధాని అవుతారని ఎవరు ఊహించారు" అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట వైరల్ అయింది.