ఆదివారం, 10 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (11:52 IST)

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

chiranjeevi
'మత్తు వదలరా-2' చిత్రం ఈ నెల 13వ తేదీన విడుదలైంది. ఈ సినిమా విడుదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అనేక మంది సినీ సెలెబ్రిటీలు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో పాటు పలువురు ప్రశంసించగా ఈ జాబితాలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా తనకు కనపడలేదని ఆయన అభినందించారు. ఎండ్ టైటిల్స్‌ను కూడా వదలకుండా చూశానని ఆయన చెప్పారు. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు రితేష్ రాణాకి ఇవ్వాలని మెచ్చుకున్నారు.
 
'దర్శకుడి రాత, తీత, కోత, మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా ఉండలేము. హ్యాట్సాఫ్ రితేష్ రాణా!' అని చిరంజీవి పేర్కొన్నారు. నటీ నటులు సింహ కోడూరి, ప్రత్యేకించి సత్యకి తన అభినందలు అని ఆయన అభినందించారు. అలాగే ఫరియా అబ్దుల్లా, కాలభైరవలకు, మంచి విజయాన్ని అందుకున్న మైత్రీ మూవీస్ సంస్థకు, టీమ్ అందరికీ అభినందనలు అని ఆయన మెచ్చుకున్నాను. శనివారం 'మత్తు వదలరా-2' చూశానంటూ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. వినోదం 100 శాతం గ్యారంటీ అని వ్యాఖ్యానించారు.
 
కాగా సింహా కథానాయకుడిగా 2019లో వచ్చిన 'మత్తువదలరా' సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. వెన్నెల కిశోర్, సత్య, ఫరియా అబ్దుల్లా, అజయ్, రోహిణి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. రితేశ్ రాణా దర్శకత్వం వహించగా పెదమల్లు చిరంజీవి - హేమలత నిర్మాతలుగా ఉన్నారు. మైత్రీ మూవీస్ బ్యానరుపై వచ్చిన ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించారు.